![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -34 లో..... అంజలి చేత రాజారావు కేక్ కట్ చేయిస్తాడు. దాంతో అంజలి ఎమోషనల్ అవుతుంది. అప్పుడే మనీష్ వచ్చి తాతయ్య నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్.. అక్కడ అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత అంజలి కి మనీష్ విషెస్ చెప్తాడు. కేక్ తినిపిస్తాడు.మరొకవైపు గీత భాను దగ్గరికి రాజారావు వెళ్లి ఆశీర్వదిస్తాడు.
ఆ తర్వాత ఎవరో ఒకతను రాజారావుకి ఫోన్ చేసి అంజలి డాటర్ అఫ్ గీతాంజలి అని చెప్తాడు. దాంతో రాజారావు షాక్ అవుతాడు. ఎవరు మీరు ఏం కావాలి అని అడిగేలోపే ఫోన్ కట్ చేస్తాడు. రాజారావు టెన్షన్ పడుతుంటే రత్నం వచ్చి ఏమైందని అడుగుతుంది. గీతాంజలి పెళ్లి కాకముందు ఒక బిడ్డకి జన్మనిఇచ్చింది కదా అని రాజారావు అనగానే అవును ఆ బిడ్డ కూడా ఉంటే బాగుండు అని రత్నం అంటుంది. ఆ బిడ్డ ఉందని రాజారావు చెప్పగానే రత్నం షాక్ అవుతుంది. షాక్ లో ఆస్తమా ఎక్కువ అవుతుంది. అందరు వస్తారు. మనీష్ తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. అందరు మెడిసిన్ కోసం వెతుకుతారు. ఎవరికి కన్పించదు. అమ్మని చూసుకునే అమ్మాయి ఎక్కడ అని గీత అనగానే మనీష్ నేను వెళ్తున్నానని అంజలి దగ్గరికి వెళ్తాడు. మెడిసిన్ ఎక్కడ నానమ్మ కి ఆస్తమా ఎక్కువ అయిందనగానే అంజలి పరిగెత్తుకొని లోపలికి వెళ్లి మెడిసిన్ తెస్తుంది. ఆ అమ్మాయే అత్తయ్య గారిని చూసుకునే అమ్మాయి అని కమల చెప్తుంది. అంజలిని చూసి గీత షాక్ అవుతుంది. ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతుంది.
ఆ అమ్మాయి ఇంట్లో పనులు అన్ని చేస్తుందని ప్రీతీ చెప్తుంది. ఇందాక సూప్ చేసిన అమ్మయి కూడా తనే అని భాను చెప్తాడు. నా పరుపుపోయేలే మీడియా ముందు మాట్లాడింది ఈ అమ్మాయే అని గీత చెప్పగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఈ అమ్మాయిని ఇప్పుడే ఇంట్లో నుంచి పంపించండి అని గీత చెప్పగానే అంజలి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళదని రాజారావు చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |